English | Telugu
లారెన్స్ కి మెగాస్టార్ ఆఫర్
Updated : Sep 10, 2015
లారెన్స్ డైరెక్టర్ గా మారిన తరువాత కొరియోగ్రాఫిని పూర్తిగా పక్కన పెట్టేసాడు. అంతేకాక యాక్టర్ గా మరి తాను దర్శకత్వం వహించిన కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా మంచి పేరునే సంపాదించాడు. ఇప్పుడు మళ్ళీ కొరియోగ్రాఫర్ మారబోతున్నాడు.అది ఎవరి కోసం..తనకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ కోసం.
రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’లో చిరు ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చిరంజీవికి ఓ పాట, ఫైట్ కూడా వున్నాయి. అయితే ఇప్పుడు చిరంజీవి పాటకి లారెన్స్ కొరియోగ్రాపి చేయబోతున్నాడట. మెగాస్టార్ నుంచి స్వయంగా పిలుపు రావడంతో మెగా కాంపౌండ్ వెంటనే వాలిపోయాడట. ప్రస్తుతం చిరు చేత లారెన్స్ ప్రాక్టిస్ చేయిస్తున్నాడట.
ఈ పాట హిందీ సాంగ్ ‘కజరారే…కజరారే…’ టైప్‌లో ఉంటుందని సమాచారం. బ్రూస్‌లీకి చిరు డాన్స్ ప్రాక్టిస్ కూడా మొదలు పెట్టేసాడు. మెగాస్టార్ స్టెప్పుల కోసం చాలాకాలంగా పడిగాపులు కాస్తున్న అభిమానులకు లారెన్స్ కొరియోగ్రాఫీ భలే కిక్కు ఇస్తుందనడంలో డౌట్ లేనట్టే.