English | Telugu
షాకింగ్ : ఫృద్వీ ఆమెను మోసం చేశాడా?
Updated : Oct 10, 2016
తెలుగులో బిజీ బిజీగా ఉంటూ... ప్రస్తుతానికి టాప్ మోస్ట్ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు ఫృథ్వీ. సినిమా హిట్టయినా, ఫ్లాపయినా తన క్యారెక్టర్‌కి మాత్రం మంచి స్పందనే వస్తోంది. హాస్యనటుడిగా ఫుల్ ఫామ్‌లో ఉన్న ఫృద్వీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఈ స్టార్ కమెడియన్‌పై ఓ కేసు నమోదయ్యిందిప్పుడు. తనని పెళ్లి చేసుకొని, మోసం చేశాడని, అందరి ముందూ తనని భార్యగా ఒప్పుకోవడం లేదని ఓ మహిళ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుని పరిశీలించిన పోలీసులు ఫృద్వీపై 498ఏ, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ విషయంపై స్పందించడానికి ఫృద్వీ అందుబాటులో లేడు. ఇదంతా ప్రచారం కోసం బాధితులురాలు చేస్తున్న పనా? లేదంటే నిజంగానే ఫృద్వీకీ ఆమెకూ సంబంధాలున్నాయా? అనే విషయంపై పోలీసులు ఇప్పటికే లోతైన దర్యాప్తు ప్రారంభించారని తెలుస్తోంది. ఫృద్వీ స్పందిస్తే గానీ ఈ వ్యవహారంలో ఓ క్లారిటీ రాదు. అయితే కామెడీ ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతున్న ఫృద్వీ కెరీర్‌లు ఇలాంటి విషయాలు మాత్రం స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్నాయి. ఇందులోంచి ఈ థర్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ ఎలా బయటపడతాడో?