English | Telugu

శాత‌క‌ర్ణిపై విష ప్ర‌చారం చేస్తోందెవ‌రు??

నంద‌మూరి బాల‌కృష్ణ వందో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. క‌చ్చితంగా ఈ సినిమా సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని బాల‌య్య అభిమానులు గంపెడాశ‌లు పెంచుకొన్నారు. ఈ సినిమాపై హైప్ కూడా ఆ స్థాయిలోనే కొన‌సాగుతోంది. బాల‌య్య లుక్‌, టీజ‌ర్ ఇవ‌న్నీ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నాయి. అయితే... ఓ వ‌ర్గం మాత్రం ప‌నిగ‌ట్టుకొని శాత‌క‌ర్ణిపై ఫీల‌ర్లు వ‌దులుతోంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌రంగా గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణిలో విష‌యం లేద‌ని, ఈ సినిమా తేలిపోవ‌డం ఖాయ‌మ‌ని, గ్రాఫిక్స్ ప‌రంగా స్టాండ‌ర్డ్స్ లేవ‌ని ఫేస్ బుక్, ట్విట్ట‌ర్‌లో ఓ వ‌ర్గం విష ప్ర‌చారం చేస్తోంద‌ని తెలుస్తోంది. దీనిపై బాల‌య్య అభిమానులు నిఘా పెట్టారు కూడా. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ చూసిన రాజ‌మౌళి పెద‌వి విరిచాడ‌ని, విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌రంగా.. బాహుబ‌లికి గౌత‌మి పుత్ర ఏ స్థాయిలోనూ పోటీ ఇవ్వ‌ద‌ని త‌న స‌న్నిహితుల‌తో చెప్పిన‌ట్టు సోష‌ల్ మీడియాలో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇది కూడా... నాన్ బాల‌య్య ఫ్యాన్స్ ప‌నిగ‌ట్ట‌గుకొని చేస్తున్న ప్ర‌చార‌మే అని తెలుస్తోంది. గౌతమి పుత్ర‌కు వ‌స్తున్న హైప్‌ని చూసుకొని కుళ్లుకుంటున్న ఓవ‌ర్గం కావాల‌ని ఇలా నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ ఇస్తోంద‌ని చెప్పుకొంటున్నారు. వాళ్లెవ‌రో ప‌ట్టుకోవాల‌ని బాల‌య్య ఫ్యాన్స్ విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గౌత‌మి పుత్ర‌పై వ‌స్తున్న నెగిటీవ్ వార్త‌ల‌ని న‌మ్మొద్ద‌ని ఆ చిత్ర‌బృందం కూడా చెబుతోంది. మ‌రి.. ప‌నిగ‌ట్టుకొని ఇలాంటి న్యూస్ స్పైడ్ చేస్తోందెవ‌రు? వాళ్లెవ‌రో దొరకాలి గానీ, బాల‌య్య ఫ్యాన్స్ భ‌ర‌తం ప‌ట్ట‌డం ఖాయం.