English | Telugu
తమన్నా - ప్రభుదేవా... కొత్త లవర్సా??
Updated : Oct 8, 2016
చిత్రసీమ ప్రేమ జంటలతో నిండిపోయిందిప్పుడు. దాదాపుగా ప్రతీ కథానాయిక గురించీ హాట్ హాట్ వార్తలు పుడుతున్నాయి. డేటింగులో ఉన్నట్టో... ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నట్టో వార్తలు వస్తున్నాయి. తాజాగా తమన్నాపైనా ఇలాంటి పుకారే ఒకటి హాట్ హాట్‌గా షికారు చేస్తోంది. ప్రభుదేవాకీ, తమన్నాకీ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందన్నది ఆ పుకార్ల సారాంశం. వీరిద్దరూ ఇటీవల అభినేత్రిలో కలసి నటించారు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్య బంధం చిగుర్లు వేసిందని తెలుస్తోంది. ఈ సినిమా ఇద్దరి బంధానికీ బలమైన పునాదులు వేసిందని... సినిమా షూటింగ్ ఉన్నా, లేకున్నా.. ఇద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరడం కామన్ అయిపోయిందని తెలుస్తోంది. తమన్నా ప్రభుదేవాకి వీరఫ్యాన్స్. అభినేత్రి ప్రమోషన్లలో ఈ డాన్సింగ్ స్టార్‌ని తమన్నా తెగ పొగిడేసింది. ప్రభుదేవా కూడా అంతే. తమన్నాకి పొగడ్డమే పనిగా పెట్టుకొన్నాడు. ఈవీరిద్దరిపై తమిళ మీడియా ఫోకస్‌పెట్టింది. హాటు హాటు కథనాల్ని ప్రసారం చేస్తోంది. ఇవి వాళ్ల దృష్టికీ పోకుండా లేవు. ''ఇద్దరం ఒకే సినిమాల చేశాం కదా. అందుకే ఇలాంటి రూమర్లు వస్తాయి. మరో సినిమా మొదలయ్యేంత వరకూ ఇవి కంటిన్యూ అవుతాయి'' అంటూ ఈ పుకార్లను లైట్‌గా తీసుకొంటున్నారు. మరి.. ఇందులో నిజం లేదంటారా??