English | Telugu

బాల‌య్య‌తో అప్పుడు క‌ళ్యాణ్ రామ్.. ఇప్పుడు తార‌క‌ర‌త్న‌?

మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా తెర‌కెక్కిన 'య‌న్టీఆర్ క‌థానాయ‌కుడు', 'య‌న్టీఆర్ మ‌హానాయ‌కుడు' చిత్రాల్లో టైటిల్ రోల్ లో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించ‌గా.. హ‌రికృష్ణ పాత్ర‌లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాల ఫ‌లితమెలా ఉన్నా.. బాబాయ్, అబ్బాయ్ కాంబినేష‌న్ సీన్స్ అభిమానుల‌ను బాగానే అల‌రించాయి.

క‌ట్ చేస్తే.. మ‌రో నంద‌మూరి అబ్బాయ్ బాల‌య్య సినిమాలో క‌నువిందు చేయ‌నున్నార‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. 'సింహా', 'లెజెండ్' చిత్రాల త‌రువాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌థ‌ను మ‌లుపు తిప్పే కీ రోల్ ఉంద‌ట‌. అందులో నంద‌మూరి తార‌క‌ర‌త్న క‌నిపిస్తార‌ని స‌మాచారం. అంతేకాదు.. ఈ పాత్ర‌లో నెగ‌టివ్ షేడ్స్ కూడా ఉంటాయ‌ని టాక్. త్వ‌ర‌లోనే తార‌క‌ర‌త్న ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్నారు.