English | Telugu
త్రిష కూడా అతనికి పడిపోయింది
Updated : Jul 16, 2015
ఆర్యని తమిళనాట రొమాంటిక్ హీరో అనిపిలుస్తుంటారు. లవ్ స్టోరీల్లో అతనితో కలసి నటించాలని కథానాయికలు ఆశ పడుతుంటారు. బయటా.. ఆర్య బహు రొమాంటిక్ అని తమిళ చిత్రవర్గాలు గుసగుసలాడుకొంటుంటాయి. తెరపైనే కాదు, బయటా కథానాయికలతో రొమాన్స్ చేస్తుంటాడని పుంఖానుపుంఖాలుగా రాస్తుంటాయి. అనుష్క, ఆర్యల మధ్య ఎఫైర్ నడుస్తుందని ఆమధ్య చెప్పుకొన్నారు. అనుష్కతోనే కాదు, నయనతారతోనూ ఇలాంటిపుకార్లే వ్యాప్తి చెందాయి. ఇప్పుడు ఆ జాబితాలో త్రిష చేరిందని టాక్. త్రిష, ఆర్యల జోడీ వెండితెరపై ఇది వరకు సందడి చేసిందే. ఆర్యతో నటించడం తనకు చాలా కంఫర్ట్‌గా ఉంటుందని, తమ ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ అదిరిపోతుందని త్రిష సెలవిచ్చింది. దక్షిణాదిన ఆర్య మంచి రొమాంటిక్ హీరో అని, అతనితో సినిమా ఛాన్స్ వస్తే.. ఎన్నిసార్లయినా వదలుకోనంటోంది త్రిష. మొత్తానికి త్రిష కూడా ఆర్యకి ఫుల్లుగా ఫ్లాటైపోయిందన్నమాట. మరి వీరిద్దరిపై ఇంకెన్ని కథనాలు పుట్టుకొస్తాయో చూడాలి.