English | Telugu

ప్ర‌భాస్ రూ.65 కోట్లు తీసుకొన్నాడా?



టాలీవుడ్ నే కాదు, యావ‌త్ భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కే షాకింగ్‌కి గురిచేసే వార్త ఇది. బాహుబ‌లి నిమిత్తం ప్ర‌భాస్ రూ.24 కోట్లు తీసుకొన్నాడన్న వార్త‌తోనే షాక్‌తిన్న టాలీవుడ్‌కి ఇది నిజంగా.. దిగ్భ్రాంతికి గురిచేసే విష‌య‌మే. ప్ర‌భాస్ తీసుకొంది రూ.24 కోట్లు కాద‌ట‌.. రూ.65 కోట్ల‌న్న బాంబ్ లాంటి వార్త‌ని పేల్చింది ఇంకెవ‌రో కాదు, త‌న ట్వీట్ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు సంచ‌ల‌నాలు రేపే రాంగోపాల్ వ‌ర్మ‌.

ఈ సినిమా లాభాల్లో ప్ర‌భాస్ షేర్ తీసుకొన్నాడ‌ని, అది రూ.65 కోట్ల‌ని వ‌ర్మ తేల్చేశాడు. రెండేళ్లు ఓ సినిమా కోసం కేటాయించి ప్ర‌భాస్ఎలాంటి త‌ప్పు చేయ‌లేదని, ఈ సినిమాతో అత‌ను ఏకంగా రూ.65 కోట్ల‌ని పారితోషికం రూపంలో అందుకొన్నాడ‌ని, ఇండియన్‌స్టార్లెవ్వ‌రికీ సాధ్యం కాని రికార్డు ఇద‌ని వ‌ర్మ కితాబిస్తున్నాడు. అంతేకాదు.. పార్ట్ 2ని ఓ కార్పొరేట్ సంస్థ‌కు 325 కోట్ల‌కు అమ్మేశార‌ని షాకింగ్ న్యూస్ చెప్పాడు వ‌ర్మ‌. ఈ వార్త‌ల్లో నిజ‌మెంతో తెలీదుగానీ.. అంకెలు మాత్రం ఫ్యాన్స్ ని సంతోష పెడుతున్నాయి. నిజంగా ప్ర‌భాస్ పారితోషికం రూ.65 కోట్ల‌యితే.. ఇండియ‌న్‌ సూప‌ర్ స్టార్ హోదాని ప్ర‌భాస్ కి క‌ట్ట‌బెట్టేయొచ్చు.