English | Telugu
'మాస్టర్ చెఫ్' షోకి హోస్ట్ గా తమన్నా!!
Updated : Jun 15, 2021
మిల్కీ బ్యూటీ తమన్నా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలో హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతుండటంతో.. తమన్నా ఇప్పుడు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. సినిమా, టీవీ, డిజిటల్ ఇలా ఏ రంగమైనా ఓకే అంటుంది. రీసెంట్ గా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. 'లెవెన్త్ అవర్', 'నవంబర్ స్టోరీ' అనే వెబ్ సిరీసుల్లో నటించింది. అయితే ఇప్పుడు తమన్నా బుల్లితెరపై కూడా సందడి చేయడానికి సిద్ధమైందని సమాచారం.
'స్టార్ ప్లస్' లో ప్రసారమవుతోన్న 'మాస్టర్ చెఫ్' అనే కుకింగ్ షో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ షోని తెలుగులో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి తమన్నాను హోస్ట్ గా తీసుకోనున్నారట. దీనికోసం ఆమెకి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ షోకి సంబంధించిన షూటింగ్ ను మొదలుపెట్టనున్నారని సమాచారం.
ఇక సినిమాల విషయానికొస్తే.. తమన్నా సీటీమార్, ఎఫ్ 3 చిత్రాలలో నటిస్తోంది. అలాగే నితిన్ నటిస్తోన్న 'మాస్ట్రో' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.