English | Telugu
రామ్‌కి విలన్ గా మాధవన్?
Updated : Jun 2, 2021
ఎనర్జిటిక్ స్టార్ రామ్, కోలీవుడ్ కెప్టెన్ లింగుస్వామి కాంబినేషన్ లో ఓ ఊరమాస్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ కి జోడీగా `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి దర్శనమివ్వనుంది. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నారు.
ఇదిలా ఉంటే.. `RAPO 19` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ నటుడు మాధవన్ దర్శనమివ్వనున్నారట. ఇదివరకు లింగుస్వామి తీసిన `రన్` (2003), `వేట్టై` (`తడాఖా` మాతృక) (2012) చిత్రాల్లో మాధవన్ కథానాయకుడిగా నటించారు. కట్ చేస్తే.. దాదాపు పదేళ్ళ తరువాత మళ్ళీ ఈ సినిమా కోసమే లింగుస్వామి - మాధవన్ ముచ్చటగా మూడోసారి జట్టుకట్టనుండడం విశేషం. త్వరలోనే రామ్ - లింగుస్వామి కాంబో మూవీలో మాధవన్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రామ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నట్లు ఒకవైపు కథనాలు వస్తుండగా.. మరోవైపు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది.