English | Telugu
సింగం 3 కూడా వస్తుందట
Updated : Jan 12, 2015
తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది ‘సింగం’. ఈ సినిమాకు సూర్య కొన్ని నెలల ముందే సీక్వెల్ తీసుకు వచ్చాడు. ‘సింగం`2’ కూడా సూపర్ హిట్ అయ్యింది. దాంతో సూర్య మరోసారి ‘సింగం’గా నటించాలని కోరుకుంటున్నాడు. అతి త్వరలో ‘సింగం`3’కి అంకురార్పణ జరిగే అవకాశాలున్నాయని తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ సినిమాకు కూడా హరి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి.ఇప్పటికే దర్శకుడు హరి మూడవ పార్ట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఆ స్క్రిప్ట్‌కు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వరుసగా వీరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో మూడవ సినిమాపై కూడా అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమాను చేయాలని సూర్య మరియు హరిలు పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం సూర్య ‘మాస్’ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే ‘సింగం`3’ పట్టాలెక్కే అవకాశాలున్నాయి.