English | Telugu

నయనతార క్రేజీ హీరోయిన్..!!

టాలీవుడ్, కోలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండ్ చాలా మారిపోయింది. ఒకప్పుడు హీరోయిన్స్ 30 ఏళ్లు వచ్చాయంటే కనుమరుగైపోయేవారు. కానీ ఇప్పుడు 30 ప్లస్‌ హీరోయిన్స్ సౌత్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. ఇలాంటి ట్రెండ్ ఎక్కువగా బాలీవుడ్ లో చూస్తుంటా౦. కరీనా, కత్రినా, ప్రియాంక ఇలా అనేకమంది స్టార్ హీరోయిన్లు టాప్ లో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు సౌత్ లో అదే ట్రెండ్ నడుస్తోంది. అనుష్క, త్రిష 30 ప్లస్‌లోనూ క్రేజీ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. ఐతే రెండు నెలల కిందటే 30వ పుట్టిన రోజు జరుపుకున్న నయనతార అయితే కెరీర్లో ఎన్నడూ లేనంత బిజీగా ఉందిప్పుడు. ఆమె ఖాతాలో ఏకంగా ఏడు సినిమాలున్నాయి. ‘మాయ’ అనే హార్రర్‌ సినిమాలో నయన్‌దే కీలక పాత్ర. నన్బేండా సినిమాలో ఉదయనిధి స్టాలిన్‌తో, ‘ఇదు నమ్మ ఆలు’లో మాజీ ప్రియుడు శింబుతో ఆడిపాడుతోంది నయన్‌. మరోవైపు సూర్యతో ‘మాస్‌’లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్‌ సేతుపతితో నటిస్తున్న నానుం రౌడీదాన్‌ సినిమాలో నయన్‌ చెవిటి యువతిగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇవి కాక తనీ ఒరువన్‌, భాస్కర్‌ ద రాస్కల్‌ అనే సినిమాల్లోనూ నటిస్తోంది నయన్‌. మూడేళ్ల కిందట ప్రభుదేవాతో బ్రేకప్‌ అయిన సమయంలో ఆమె తమిళంలో ఒక్క సినిమా కూడా లేని స్థితిలో ఉంది. ఇప్పుడు కెరీర్లోనే ఎన్నడూ లేనంత బిజీగా ఉంది.