English | Telugu
సుకుమార్ డిప్రెషన్ ఉన్నాడా?
Updated : Jan 23, 2016
నాన్నకు ప్రేమతో రిజల్ట్ పట్ల సుకుమార్ అసంతృప్తితో ఉన్నాడు. సినిమా బాగా తీసినా లాజిక్కు లేదంటున్నారని.. తన సన్నిహితుల దగ్గర వాపోతున్నాడు. బీసీ ఆడియన్ నాడీ పట్టుకోలేకపోతున్నానేమో అన్న ఆవేదన సుకుమార్‌లో వ్యక్తం అవుతోంది. అందుకే సినిమాలకు దూరం అవ్వాలన్న రాంగ్ డిసీజన్‌కి వచ్చినట్టు టాక్. కొన్ని సినిమాల తరవాత దర్శకత్వానికి దూరమై.. రచయితగా, నిర్మాతగా సెటిల్ అవుదామనుకొంటున్నాడట. ఒకవేళ సినిమాలు తీసినా... ఫక్తు కమర్షియల్ చిత్రాలవైపే మొగ్గు చూపిస్తా.. అంటున్నాడట.
జనాలకు రొటీన్ సినిమాలే నచ్చుతున్నాయని, తానూ ఆ తరహా సినిమాలే తీస్తానని ఆవేశంగా అంటున్నాడట. ఇదంతా చూస్తుంటే సుకుమార్ కాస్త డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నాడేమో అనిపిస్తోంది. సుక్కు క్రియేటివిటీని తక్కువ అంచనా వేయలేం.. ఆర్య, 100 % లవ్ సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. అందులో క్రియేటివిటీ, కమర్షియాలిటీ రెండూ మిక్సయ్యాయి. అయితే... 1, నాన్నకు ప్రేమతో సినిమాలో తన క్రియేటివిటీ మాత్రమే కనిపించింది. ప్రేక్షకుల్ని కన్‌ఫ్యూజ్ చేసే మెథడ్స్‌తో సీన్లు రాసుకోవడం సుకుమార్‌లోని ప్రధానమైనస్. దాన్ని సరిదిద్దుకోగలిగితే... తప్పకుండా మంచి సినిమాలు తీయగలడు. సినిమాల్ని వదిలేయాలన్న కాన్సెప్ట్ ని వదిలి... ఈ విషయంపై ఆలోచిస్తే బాగుంటుంది.