English | Telugu
చిరు - పవన్.... ఒకేపాటలో?!
Updated : Jan 29, 2016
సర్దార్ సెట్లో చిరంజీవి అడుగుపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. `అన్నదమ్ములు కలయిక కొత్త ప్రశ్నలకు, సందేహాలకు, కాంబినేష్లకు దారిచ్చింది. చిరు, పవన్‌ల మధ్య రాజకీయపరమైన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు చెప్పుకొంటున్నారు. కత్తి సినిమా రీమేక్‌పై చిరుని పవన్.. కొన్ని వివరాలు అడిగి తెలుసుకొన్నాడట. అన్నింటికంటే ముఖ్యంగా.. సర్దార్ సినిమాలో అన్నదమ్ములిద్దరూ కలసి ఓ పాటలో చిందేస్తున్నారన్నది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇది వరకు శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్‌లలో పవన్ కనిపించాడు. అయితే ఒక్కసారి కూడా పవన్ సినిమాలో చిరు సందడి చేయలేదు. ఆలోటు,. సర్దార్ తో తీరబోతోందన్నమాట. సర్దార్ కోసం దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ గా ఓ ఐటెమ్ సాంగ్ కంపోజ్ చేశాడు. ఆ పాటలోనే చిరు, పవన్ కలసి స్టెప్పులేస్తారట. నిజంగానే ఇది నిజమైతే సర్దార్‌లో ఇంతకు మించిన సెంట్రాఫ్ ఎట్రాక్షన్ మరోటి ఉండదు.