English | Telugu

చ‌ర‌ణ్ కి జోడీగా `లోఫ‌ర్` భామ‌!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌రుస సినిమాల‌తో ఫుల్ జోష్ లో ఉన్నారు. అత‌ని తాజా చిత్రాలు `ఆర్ ఆర్ ఆర్`, `ఆచార్య‌` రెండు వ‌రుస నెలల్లో సంద‌డి చేయ‌నున్నాయి. జ‌న‌వ‌రి 7న `ఆర్ ఆర్ ఆర్` విడుద‌ల కానుండ‌గా.. ఫిబ్ర‌వ‌రి 4న `ఆచార్య‌` థియేట‌ర్స్ లోకి రాబోతోంది. ఈ రెండు కూడా మ‌ల్టిస్టార‌ర్ మూవీస్ నే కావ‌డం విశేషం. `ఆర్ ఆర్ ఆర్`లో యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించిన చ‌ర‌ణ్.. `ఆచార్య‌`లో త‌న తండ్రి మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. 'ఆర్ ఆర్ ఆర్', `ఆచార్య‌` త‌రువాత సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ సినిమా చేస్తున్నారు రామ్ చ‌ర‌ణ్. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2023లో రిలీజ్ కానుంది. అదేవిధంగా.. `జెర్సీ` కెప్టెన్ గౌత‌మ్ తిన్న‌నూరి కాంబినేష‌న్ లోనూ ఓ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు చ‌ర‌ణ్. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొంద‌నున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ వ‌చ్చే సంవ‌త్స‌రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. కాగా, ఈ చిత్రంలో `లోఫ‌ర్` భామ దిశా ప‌టాని నాయిక‌గా న‌టించ‌నుంద‌ని ఇన్ సైడ్ టాక్. అదే గ‌నుక నిజ‌మైతే.. చ‌ర‌ణ్‌, దిశ కాంబోలో వ‌చ్చే మొద‌టి సినిమా ఇదే అవుతుంది. త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్ - గౌత‌మ్ కాంబో మూవీలో దిశ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న `లోఫ‌ర్`లో క‌నువిందు చేసిన దిశా ప‌టాని.. అతని అన్న చ‌ర‌ణ్ ప‌క్క‌న కూడా అల‌రిస్తుందేమో చూడాలి.

కాగా `ఆర్ ఆర్ ఆర్`లో ఆలియా భ‌ట్, `ఆచార్య‌`లో పూజా హెగ్డే, శంక‌ర్ సినిమాలో కియారా అద్వానితో రొమాన్స్ చేస్తున్నారు రామ్ చ‌ర‌ణ్.