English | Telugu

శ్రీనువైట్లతో మెగా ప్రిన్స్..!!

'లోఫర్' హీరో వరుణ్‌ తేజ్‌ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఆసక్తి రేపుతోంది. మెగా కుర్రాడు వరుణ్‌ తేజ్‌ తన తరువాత సినిమా కోసం వైట్ల జట్టు కట్టొచ్చని సమాచారం. ఈ విషయంలో వరుణ్‌ నుంచి నిర్మాత సి.కళ్యాణ్‌ కమిట్మెంట్‌ కూడా తీసుకున్నాడట. వరుణ్‌ కొత్త సినిమా 'లోఫర్‌' నిర్మాత ఆయనే అన్న సంగతి తెలిసిందే. 'ముకుంద' విడుదల కాకముందే వరుణ్‌ తో సినిమా చేస్తానని మాటిచ్చి.. 'లోఫర్‌'తో మాట నిలబెట్టుకున్నాడు కళ్యాణ్‌. ఆ గ్రాటిట్యూడ్‌ తోనే వరుణ్‌ కూడా వైట్లతో పని చేయడానికి ఓకే చెప్పేశాడట. ఇప్పటిదాకా సీరియస్‌ సినిమాలే చేసిన నేపథ్యంలో వైట్ల తరహా కామెడీ సినిమా చేస్తే వైవిధ్యంగానూ ఉంటుందని భావిస్తున్నాడట వరుణ్ తేజ్.