English | Telugu
లోఫర్ టాక్..పూరీకి భయపడుతున్న హీరోలు
Updated : Dec 18, 2015
లోఫర్ టాక్ బయటికొచ్చినప్పట్నుంచి పూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు తెలుస్తోంది. పూరి తమకోసం ఎలాంటి కథని తయారు చేసుకొస్తాడో వాటిని కాదంటే ఏమనుకుంటాడో అని భయపడుతున్నారట. బన్నీ అయితే ఏ మాత్రం మొహమాటం లేకుండా రొటీన్ కథలు వద్దనే సూచనని పూరికి చేరవేశాడట. అందుకే బన్నీకోసం తయారు చేసిన కథలో కాసిన్ని మార్పులు చేసే క్రమంలో పూరి ఉన్నట్టు సమాచారం. ఒకవేళ బన్నీ అప్పటికీ సంతృప్తిపడకపోతే పూరి కన్ను మహేష్ పైనే పడుతుంది. ఎందుకంటే మహేష్ చాలా రోజులక్రితమే పూరికి మాటిచ్చాడు. ఎలాంటి కథని తీసుకొచ్చినా చేసేద్దాం అని చెప్పాడట. తనతో పోకిరి - బిజినెస్ మేన్ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు తీశాడు కాబట్టి మహేష్ పూరిపై అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడన్నమాట. కానీ లోఫర్ టాక్ తరువాత మహేష్ కూడా పూరితో చేయడానికి ఆలోచిస్తున్నాడట.