English | Telugu
ఆ హీరోయిన్‌ని పూరి బాగా ఇబ్బంది పెట్టాడా??
Updated : Dec 16, 2015
లోఫర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది దిశాపటానీ. పూరి సినిమాలో ఛాన్సన్నమాటేగానీ.. ఈ అమ్మాయికి తగిన ప్రమోషన్స్ లభించడం లేదు. ట్రైలర్‌లోనూ... ఈమెను సరిగ్గా చూపించడం లేదు. దానికి కారణం.. పూరికీ ఆమెకు బాగా చెడిందని టాక్. లోకేషన్లలో పూరిని ఈ అమ్మాయి బాగా ఇబ్బంది పెట్టిందని, పూరి కూడా.. దిశాపటానీతో సరిగ్గా వ్యవహరించలేదని టాక్. లోఫర్ పూర్తయ్యేసరికి దిశాపటానీ పూర్తిగా విసిగిపోయిందని, ఇక తెలుగులో సినిమాలు చేయకూడదన్న స్థాయిలో ఆమెను పూరి ఇబ్బంది పెట్టాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని పూరిని అడిగితే ''అలాంటిదేం లేదు. ఆ అమ్మాయి బాగానే కోపరేట్ చేసింది. తెలుగు రాదు కదా.. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అవన్నీ మామూలే'' అని చెప్పుకొచ్చాడు.