English | Telugu

మ‌హేష్ భ‌య‌ప‌డ్డాడు

బాహుబ‌లి ఎఫెక్ట్ టాలీవుడ్‌పై చెప్ప‌లేనంత ప‌డిపోతోంది. ఈ సినిమాకి ముందూ, వెనుక త‌మ సినిమాలు రిలీజ్ కాకుండా నిర్మాత‌లు జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. బాహుబ‌లికి అటు రెండు వారాలు, ఇటు రెండు వారాలూ మ‌రో సినిమా విడుద‌ల కాద‌న్న‌ది రూఢీ అయిపోయింది. అయితే మ‌హేష్ బాబు మాత్రం `నేనున్నా..` అంటూ బాహుబ‌లిపై యుద్దానికి స‌మ‌ర‌శంఖం ఊదాడు.

త‌న శ్రీ‌మంతుడు సినిమాని బాహుబ‌లి విడుద‌లైన మ‌రుస‌టి వార‌మే...అంటే జులై 17కే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకొన్నాడు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌ప‌రిచాడు కూడా. అయితే ఇప్పుడు ఆ నిర్ణ‌యం వెన‌క్కి తీసుకొన్నాడ‌ని టాక్‌. బ‌య్య‌ర్ల కోరిక‌మేర‌కు... విడుద‌ల తేదీని వాయిదా వేశాడ‌ట‌. ఆగ‌స్టు 7న శ్రీ‌మంతుడు ని విడుద‌ల చేయాల‌ని తాజాగా నిర్ణ‌యించుకొన్న‌ట్టు తెలుస్తోంది.

బాహుబ‌లిలాంటి పెద్ద సినిమాలు వ‌స్తున్న‌ప్పుడు పోటీకి పోకుండా... సోలో రిలీజ్ కోసం ట్రై చేసుకోవ‌డం మేల‌ని నిర్మాత‌లు, మ‌హేష్ స‌న్నిహితులు స‌ల‌హా ఇచ్చార‌ట‌. దాంతోపాటు ఈసినిమాకి మ‌హేష్ నిర్మాణ భాగ‌స్వామిగానూ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అందుకే... త‌న నిర్ణ‌యాన్ని వెనక్కి తీసుకొంటున్న‌ట్టు తెలిసింది. బాహుబ‌లినా.. మ‌జాకా.