English | Telugu
పవన్ కథతో ఎన్టీఆర్ సినిమా?
Updated : Jun 8, 2015
ఒకరి కోసం తయారు చేసుకున్న కథని మరొకరి కోసం సినిమాగా మలచడం అన్నది సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు జరిగే వ్యవహారమే. ఇప్పుడు ఇదే వైనం.. టాప్ స్టార్ ఎన్టీఆర్ నటించబోయే కొత్త సినిమాకి వర్తిస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. మరో టాప్ హీరో పవన్ కళ్యాణ్ కోసం తయారు చేసుకున్న కథలోనే తారక్ నటించబోతున్నాడన్నది ఆ వార్తల సారాంశం. కాస్తంత వివరాల్లోకి వెళితే.. రెండేళ్ల క్రితం పవన్ హీరోగా 'కోబలి' పేరుతో త్రివిక్రమ్ ఓ స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఆ ప్రాజెక్టు అలా అలా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇక 'సన్నాఫ్ సత్యమూర్తి' తరువాత మహేష్‌తోనో లేదంటే పవన్‌తోనో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయాలనుకుని.. అది కుదరక ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమాకి ఫిక్స్ అయిన త్రివిక్రమ్.. ఇప్పుడు పవన్ కోసం తయారుచేసుకున్న 'కోబలి' స్క్రిప్ట్ తోనే తారక్ సినిమా చేయబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది.