English | Telugu

నితిన్ ట్రాక్ తప్పుతున్నాడా?

ఇష్క్ సినిమాకి ముందు నితిన్ జీరో. వరస హిట్స్ వచ్చేసరికి నైజాంలో స్టార్ హీరో రేంజుకి ఎదిగాడు. అయితే తన కెరీర్ ను మలుపుతిప్పిన ఈ లవ్ స్టోరీస్ ను లైట్ తీసుకుని.. ఇప్పుడు మళ్లీ మాస్ మూవీలపై మోజు పెంచుకుంటున్నాడట. లేటెస్ట్ గా నితిన్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ మూవీ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని సమాచారం.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన హార్ట్ ఎటాక్ లోనూ నితిన్ కు కాస్తంత మాస్ టచ్ ఇచ్చాడు పూరీ. అయితే ఈసారి మాత్రం నితిన్ లోని మాస్ హీరోను పూర్తిగా పూరి ఎలివేట్ చేయనున్నాడట. తనని లైమ్ లైట్ లోకి తెచ్చిన లవ్ స్టోరీస్ పై కాన్షన్ ట్రేట్ చేయకుండా.. మళ్లీ యాక్షన్ ఇమేజ్ కోసం ఈ యంగ్ హీరో వెంపర్లాడటం తగదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

నితిన్ ఈ విషయంలో మళ్లీ పెద్ద తప్పు చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. తనకు అచ్చిరాని ఇమేజ్ తో కుస్తీ పడతాడో లేక కలిసొచ్చిన ప్రేమకథలతో ప్రయాణం చేస్తాడో నితిన్ కే తెలియాలి!