English | Telugu

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్!! 

స్మాల్ గ్యాప్ తరువాత 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్ లో 'హరి హర వీర మల్లు', సాగర్ చంద్ర డైరెక్షన్ లో 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్, హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో ప్రాజెక్ట్ లైన్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రొడ్యూసర్ దిల్ రాజు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలతో పవన్ కోసం ఒక స్టోరీ రెడీ చేయమని చెప్పినట్లు సమాచారం.

ఇటీవల పవన్ తో 'వకీల్ సాబ్' చేసి హిట్ కొట్టిన దిల్ రాజు.. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం పవన్ కి అడ్వాన్స్ ఇచ్చారట. అయితే ఆ ప్రాజెక్టును శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించాలని భావించిన దిల్ రాజు.. ఆయనకి కాల్ చేసి.. మంచి కథను రెడీ చేసుకుని పవన్ కి వినిపించమని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో దిల్ రాజు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో 'కొత్త బంగారులోకం', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' ఘన విజయం సాధించాయి. ఆ నమ్మకంతోనే దిల్ రాజు ఆయనకు స్టోరీ రెడీ చేయమని చెప్పారని.. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల అదే పనిలో ఉన్నాడని అంటున్నారు.

'కొత్త బంగారులోకం', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ముకుంద' వంటి సినిమాలతో అలరించిన శ్రీకాంత్ అడ్డాల.. ఆ తరువాత మహేష్ బాబుతో చేసిన 'బ్రహ్మోత్సవం' దెబ్బకి సైలెంట్ అయిపోయారు. చాలా గ్యాప్ తరువాత వెంకటేష్ తో 'నారప్ప' చేసే ఛాన్స్ దక్కించుకున్న ఆయన.. ఇప్పుడిప్పుడే మళ్ళీ ట్రాక్ లో పడుతున్నారు అనిపిస్తోంది.