English | Telugu

బాప్‌రే.. ఒక్కో పాట‌కు సిద్ శ్రీ‌రామ్ అంత డిమాండ్ చేస్తున్నాడా?

ఇవాళ సింగ‌ర్ సిద్ శ్రీ‌రామ్‌కు ఉన్న క్రేజ్ అలాంటిదిలాంటిది కాదు. త‌మ సినిమాలో ఒక్క పాట‌నైనా సిద్‌తో పాడించాల‌ని అటు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు గ‌ట్టిగా కోరుకుంటున్నారు. వారి డిమాండ్‌కు త‌లొగ్గి మ్యూజిక్ డైరెక్ట‌ర్లు కూడా అత‌డితో ఓ పాట పాడించ‌డానికి క‌ష్ట‌ప‌డుతున్నారు. ఎందుకు క‌ష్ట‌మంటే.. అంద‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌కు సిద్ చాన్స్ ఇవ్వ‌ట్లేదు. చాలా సెల‌క్టివ్‌గా సాంగ్స్ ఎంచుకొని పాడుతున్నాడు మ‌రి! లేటెస్ట్‌గా 'పుష్ప' సినిమాలో అత‌డు పాడిన "శ్రీ‌వ‌ల్లి" పాట దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అత‌డి పాడిన పాట‌ల్లో 90 శాతానికి పైగా సంగీత ప్రియుల నోళ్ల‌లో నానుతూనే ఉన్నాయి.

Also read:తార‌క్.. కెరీర్‌లో తొలి డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టేనా!?

ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌లో జోరుగా ప్ర‌చారంలోకి వ‌చ్చిన‌దాని ప్ర‌కారం హిందీ సినిమాల్లో ఒక పాట పాడ్డానికి అత‌ను ఏకంగా రూ. 6 ల‌క్ష‌లు వ‌సూలు చేస్తున్నాడంట‌. అక్క‌డి మ్యూజిక్ డైరెక్ట‌ర్లు సైతం అత‌డి డిమాండ్‌కు త‌లొగ్గి అత‌డు అడిగినంత ఇవ్వ‌డానికి ముందుకు వ‌చ్చారంట‌.

Also read:కొత్తింట్లో అడుగుపెట్టి ఏడాద‌య్యింది.. ఎమోష‌న‌ల్ అయిన పూజ‌!

ఇప్ప‌టివ‌ర‌కూ సిద్ శ్రీ‌రామ్ 77 తెలుగు పాట‌లు, 79 త‌మిళ పాట‌లు, 10 మ‌ల‌యాళం, 6 క‌న్న‌డ పాట‌లు ఆల‌పించాడు. అత‌డి గొంతులోని మాధుర్యం ప్ర‌తి పాట‌లోనూ మ‌న‌కు వినిపిస్తుంద‌నేది నిజం. అంతే కాదు, ఫుల్‌టైమ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మార‌డానికి సిద్ అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం 'వాన‌మ్ కొట్ట‌ట్టుమ్' అనే త‌మిళ‌ సినిమాకు ట్యూన్స్ ఇస్తున్నాడు.