Home

»

Latest News

కొత్తింట్లో అడుగుపెట్టి ఏడాద‌య్యింది.. ఎమోష‌న‌ల్ అయిన పూజ‌!

Jan 22, 2022 3:41PM

 

సొంత ఇల్ల‌నేది ప్ర‌తి ఒక్క‌రికీ ఉండే క‌ల‌. అదీ పెళ్లి కాకుండానే సొంత ఇల్లును స‌మ‌కూర్చుకుంటే దాంట్లో ఉండే ఆనంద‌మే వేరు. సెల‌బ్రిటీలైనా ఈ ఫీలింగ్‌కు అతీతులు కారని బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేను చూస్తే అర్థ‌మ‌వుతుంది. స‌రిగ్గా ఏడాది క్రితం ఆమె ముంబైలో ఒక‌ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. ఆ రోజును త‌ల‌చుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో త‌ను గృహ‌ప్ర‌వేశం చేసిన ఒక ఫొటోను షేర్ చేసింది. “సంవ‌త్స‌రం క్రితం ఇదే రోజు నుండి అన్ని కలలు నెరవేరినందుకు సంతోషంగా ఉంది… కేవలం మిమ్మల్ని మీరు విశ్వసించండి, కష్టపడి పని చేయండి. ప‌ట్టుద‌ల క‌లిగిన గుండెతో ఈ విశ్వం నిజంగా ప్రేమలో పడుతుంది." అని రాసుకొచ్చింది. దానికి #onwardsandupwards అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది.

Also read: టాలీవుడ్ స్టార్స్ @ బ్యాక్ టు బ్యాక్ హిట్స్!

ఆ ఫొటోలో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా దుస్తులు ధ‌రించి, చేతిలో కొబ్బ‌రికాయ ప‌ట్టుకొని భ‌క్తిగా పూజ‌లో పాల్గొన్న పూజ క‌నిపిస్తోంది. గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో బాంద్రా (ముంబై)లో స‌ముద్రానికి అభిముఖంగా 3 బెడ్‌రూమ్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది పూజ‌. ఇది ఆమె త‌న సంపాద‌న‌తో కొన్న మొట్ట‌మొద‌టి ఇల్లు. అందువ‌ల్ల దానికి ఆమె హృద‌యంలో ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంద‌ని ఎవ‌రైనా ఈజీగా అర్థం చేసుకోగ‌ల‌రు. ఈ అపార్ట్‌మెంట్‌ను త‌న అభిరుచికి త‌గ్గ‌ట్లు ఇంటీరియ‌ర్‌తో తీర్చిదిద్దుకుంది.

Also read: ల‌క్కీ సీజ‌న్ లో పూజ డ‌బుల్ హిట్స్ కొడుతుందా!?

ప‌ని విష‌యానికి వ‌స్తే, ఇప్ప‌టికే ఆమె ప్ర‌భాస్‌తో తొలిసారి జ‌త‌క‌ట్టిన 'రాధేశ్యామ్' మూవీని పూర్తిచేసి, దాని విడుద‌ల కోసం ఎదురుచూస్తోంది. అలాగే రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టించిన 'ఆచార్య' మూవీ ఏప్రిల్ 1 రానున్న‌ది. ఇవి కాకుండా విజ‌య్‌తో 'బీస్ట్' అనే త‌మిళ సినిమా, ర‌ణ‌వీర్ సింగ్‌తో 'స‌ర్క‌స్' అనే హిందీ సినిమా చేస్తోంది పూజ‌. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com