English | Telugu

బాల‌య్య‌తో శ్రుతి హాస‌న్?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ .. ఇలా ఈత‌రం అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ జ‌ట్టుక‌ట్టేసింది శ్రుతి హాస‌న్. ప్ర‌స్తుతం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కి జోడీగా `స‌లార్` చేస్తోంది. ఇక 50 ప్ల‌స్ హీరో అయిన మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తోనూ సినిమాలు చేసింది శ్రుతి. ఈ నేప‌థ్యంలో.. 60 ప్ల‌స్ స్టార్ కి కూడా జంట‌గా న‌టించేందుకు ఈ చెన్నైపొన్ను గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా టాలెంటెడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఓ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమాలో బాల‌య్య‌కి జోడీగా ఇద్ద‌రు నాయిక‌లు సంద‌డి చేయ‌నున్నార‌ని స‌మాచారం. వారిలో ఒక‌రిగా శ్రుతి హాస‌న్ ని ఎంపిక చేసిన‌ట్లు బ‌జ్. గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రుతి ఇప్ప‌టికే `బలుపు`, `క్రాక్` చిత్రాల్లో న‌టించింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. ఈ సెంటిమెంట్ తోనే.. బాల‌య్య చిత్రంలోనూ శ్రుతిని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట గోపీచంద్. మ‌రి.. ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.