English | Telugu

ప్ర‌భాస్ తో శ్ర‌ద్ధ చిందులు!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గ‌త చిత్రం `సాహో`లో క‌థానాయిక‌గా క‌నువిందు చేసింది బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్. క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్ మ‌రోమారు ప్ర‌భాస్ తో జ‌ట్టుక‌ట్ట‌నుంద‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `కేజీఎఫ్` కెప్టెన్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్` పేరుతో ప్ర‌భాస్ ఓ యాక్ష‌న్ సాగాని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో చెన్నై పొన్ను శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. కాగా, క‌థానుసారం `స‌లార్` చిత్రంలో ఓ ప్ర‌త్యేక గీతానికి స్థాన‌ముంద‌ట‌. తొలుత ఈ పాట‌లో `కేజీఎఫ్` హీరోయిన్ శ్రీ‌నిధి శెట్టి స్టెప్స్ వేయ‌బోతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగింది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. శ్ర‌ద్ధా క‌పూర్ పై ఈ క‌ల‌ర్ ఫుల్ సాంగ్ ని డిజైన్ చేశార‌ట‌. మ‌రి.. ప్ర‌భాస్ తో శ్ర‌ద్ధా క‌పూర్ వేసే చిందులు.. ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ కి ఏ మేర‌కు ప్ల‌స్స‌వుతాయో చూడాలి. త్వ‌ర‌లోనే `స‌లార్`లో `సాహో` సుంద‌రి ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది.

ఇదిలా ఉంటే.. శ్ర‌ద్ధా క‌పూర్ ప్ర‌స్తుతం ల‌వ్ రంజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ హిందీ చిత్రం చేస్తోంది. 2022లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.