English | Telugu

చిరు కోసం బ్రిట్నీ స్పియ‌ర్స్ పాట‌!

బ్రిట్నీ స్పియ‌ర్స్.. సంగీత ప్రియుల‌కు ప‌రిచ‌యం చేయ‌నక్క‌ర్లేని పేరు. త‌నదైన గాత్రం, న‌ర్త‌నంతో చిరస్మ‌ర‌ణీయమైన ముద్ర వేసిన ఈ 40 ఏళ్ళ అమెరిక‌న్ మ‌ల్టి టాలెంటెడ్.. త్వ‌ర‌లో మెగాస్టార్ కోసం టాలీవుడ్ బాట ప‌ట్ట‌నుంద‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `లూసిఫ‌ర్` ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో `గాడ్ ఫాద‌ర్` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. `హ‌నుమాన్ జంక్ష‌న్` ఫేమ్ మోహ‌న రాజా తెర‌కెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. కాగా, ఈ సినిమా కోస‌మే చిరుతో తొలిసారిగా జ‌ట్టుక‌డుతున్న యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్.. ఓ సంచ‌ల‌న ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. అదేమిటంటే.. వ‌ర‌ల్డ్ వైడ్ పాపులారిటీ పొందిన బ్రిట్నీ స్పియ‌ర్స్ చేత మంచి కిక్ ఉన్న ఓ పాట‌ని పాడించ‌బోతున్నార‌ట‌. ఇందుకోసం.. బ్రిట్నీకి భారీ పారితోషికాన్నే చెల్లించ‌బోతున్న‌ట్లు టాలీవుడ్ టాక్. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, ఎన్వీ ప్ర‌సాద్ నిర్మాణంలో త‌యార‌వుతున్న `గాడ్ ఫాద‌ర్`కి ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు నిర‌వ్ షా సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 2022లో ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.