English | Telugu

బాల‌య్య‌కి జోడీగా అదితి రావ్ హైద‌రీ?

న‌టిగా అదితి రావ్ హైద‌రీది 14 ఏళ్ళ సినీ ప్ర‌స్థానం. ఈ ప్ర‌యాణంలో త‌మిళ‌, హిందీ, తెలుగు, మ‌ల‌యాళ భాష‌ల్లో ప‌లు చిత్రాలు చేశారు ఈ స్ట‌న్నింగ్ బ్యూటీ. `స‌మ్మోహ‌నం`తో టాలీవుడ్ లో నేరుగా ఎంట్రీ ఇచ్చిన అదితికి.. మొద‌టి ప్ర‌య‌త్న‌మే న‌టిగా మంచి గుర్తింపుని తీసుకువ‌చ్చింది. అయితే, ఆ త‌రువాత వ‌చ్చిన `అంత‌రిక్షం`, `వి` చిత్రాలు ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేక‌పోయాయి. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ‌.. శ‌ర్వానంద్, సిద్ధార్థ్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న మ‌ల్టిస్టార‌ర్ `మ‌హాస‌ముద్రం`లో న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో సీనియ‌ర్ స్టార్ కి జోడీగా అదితి రావ్ హైద‌రీని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని టాక్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో ఓ యాక్ష‌న్ డ్రామా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. మే నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. కాగా, ఈ చిత్రంలో బాల‌య్య‌కి జోడీగా అదితి రావ్ పేరుని ప‌రిశీలిస్తున్నార‌ని టాక్. త్వ‌ర‌లోనే బాల‌య్య - గోపీచంద్ కాంబో మూవీలో అదితి ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.