English | Telugu
మేజర్‌గా యంగ్ రెబల్ స్టార్?
Updated : May 18, 2021
పాన్ - ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చాక సినిమాకో అవతారమెత్తుతున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ పరంపరలోనే.. `సలార్`లోనూ నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనున్నారట ఈ ఉప్పలపాటి వారి హ్యాండ్సమ్ హీరో.
ఆ వివరాల్లోకి వెళితే.. `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న పాన్ - ఇండియా మూవీ `సలార్`లో ప్రభాస్ తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఫాదర్ రోల్ కోసం ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారట ప్రభాస్. అంతేకాదు.. ఈ మేజర్ పాత్ర కోసం సరికొత్త మేకోవర్ లో సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు టాక్. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
`సలార్`లో ప్రభాస్ కి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. `కేజీఎఫ్` నిర్మాణ సంస్థ హొంబళే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ సాగాకి `కేజీఎఫ్` ఫేమ్ రవి బస్రూర్ బాణీలు అందిస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న `సలార్`ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.