English | Telugu

శ‌ర్వానంద్ తో కృతి శెట్టి రొమాన్స్!?

`ఉప్పెన‌`, `శ్యామ్ సింగ రాయ్`, `బంగార్రాజు` చిత్రాలతో తెలుగునాట‌ హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది కృతి శెట్టి. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి చేతిలో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, `మాచ‌ర్ల నియోజ‌కవ‌ర్గం`, `ద వారియ‌ర్` సినిమాలు ఉన్నాయి. వీటిలో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధం కాగా.. మిగిలిన రెండు చిత్రాలు కూడా షూటింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి.

Also Read:ప్రభాస్ మంచితనానికి పూజా హెగ్డే తల్లి ఫిదా!

ఇదిలా ఉంటే, తాజాగా ఈ ముద్దుగుమ్మ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాలీవుడ్ టాక్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌ని బ‌జ్. `ఛ‌ల్ మోహ‌న్ రంగ‌` ఫేమ్ కృష్ణ చైత‌న్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తార‌ని వినిపిస్తోంది. ఇందులో క‌థానాయిక‌గా న‌టించేందుకు కృతి శెట్టి అంగీక‌రించింద‌ని స‌మాచారం. అంతేకాదు.. అభిన‌యానికి ప్రాధాన్య‌మున్న పాత్ర‌లోనే ఆమె ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే శ‌ర్వానంద్ - కృష్ణ చైత‌న్య కాంబో మూవీలో కృతి ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. మ‌రి.. శ‌ర్వానంద్, కృతి శెట్టి ఫ‌స్ట్ టైమ్ కాంబినేష‌న్ ఏ మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.