English | Telugu

`స‌ర్కారు వారి పాట‌` సెకండ్ సింగిల్ అప్పుడేనా!?

వాలెంటైన్స్ డే స్పెష‌ల్ గా రిలీజైన `స‌ర్కారు వారి పాట‌` ఫ‌స్ట్ సింగిల్ ``క‌ళావ‌తి``.. యూట్యూబ్ ముంగిట సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు - కేర‌ళ‌కుట్టి కీర్తి సురేశ్ మ‌ధ్య‌ కెమిస్ట్రీ, యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీ, సిద్ శ్రీ‌రామ్ గానం, అనంత్ శ్రీ‌రామ్ సాహిత్యం.. వెర‌సి ఈ పాట ఇన్ స్టంట్ చార్ట్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. దీంతో, `స‌ర్కారు వారి పాట‌` సెకండ్ సింగిల్ పై మ‌హేశ్ బాబు అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొని ఉంది.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. మార్చి 18న `స‌ర్కారు వారి పాట‌` నుంచి రెండో గీతం రాబోతోంద‌ట‌. ఈ సారి.. రొమాంటిక్ నంబ‌ర్ కాకుండా టైటిల్ సాంగ్ రాబోతోంద‌ని టాక్. క‌థానాయ‌కుడి పాత్ర‌, సినిమా నేప‌థ్యాన్ని ఎలివేట్ చేసేలా ఈ పాట ఉంటుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే `స‌ర్కారు వారి పాట‌` సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రానున్న‌ది. మ‌రి.. ``క‌ళావ‌తి`` లాగే టైటిల్ సాంగ్ కూడా సంచ‌ల‌నం సృష్టిస్తుందేమో చూడాలి.

కాగా, `స‌ర్కారు వారి పాట‌`ని మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్ల‌స్, జి. మ‌హేశ్ బాబు ఎంట‌ర్టైన్మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వేస‌వి కానుక‌గా మే 12న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జ‌నం ముందుకు రానుంది.