English | Telugu

అనిల్.. మ‌రో సీక్వెల్ ఐడియా?

తీసింది త‌క్కువ సినిమాలే అయినా.. 100 % స‌క్సెస్ అందుకుని వార్త‌ల్లో నిలుస్తున్నాడు వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఎంట‌ర్టైన్మెంట్ కే పెద్ద‌పీట వేసే ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందిన అనిల్.. ఇప్ప‌టివ‌ర‌కు రూపొందించిన ఐదు సినిమాలు కూడా వేటిక‌వే సంబంధం లేని క‌థ‌లతో త‌యార‌య్యాయి. అయితే, రాబోయే చిత్రాల‌ను మాత్రం వాటికి కొన‌సాగింపు క‌థ‌లుగా ప్లాన్ చేస్తున్నాడ‌ని బ‌జ్.

ప్ర‌స్తుతం `ఎఫ్ 2`కి సీక్వెల్ గా `ఎఫ్ 3`ని తెర‌కెక్కిస్తున్న అనిల్ రావిపూడి.. త్వ‌ర‌లో `రాజా ది గ్రేట్`కి సీక్వెల్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అంతేకాదు.. త‌న ప్రీవియ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `స‌రిలేరు నీకెవ్వ‌రు`కి కూడా సీక్వెల్ చేసే ఐడియాలో ఉన్నాడ‌ట అనిల్. స్క్రిప్ట్ సిద్ధ‌మ‌య్యాక సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో చ‌ర్చించి.. ఆన‌క నిర్మాణ‌ప్ర‌య‌త్నాలు చేయ‌బోతున్న‌ట్లు టాక్. మ‌రి.. ఈ ప్ర‌చారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, విక్ట‌రీ వెంక‌టేశ్ - మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న `ఎఫ్ 3` ఆగ‌స్టు 27న విడుద‌ల కావాల్సిఉంది. అయితే క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డే అవ‌కాశ‌ముంద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి.