English | Telugu

బాల‌య్య‌తో అనిల్ `భారీ` ప్లాన్?

న‌ట‌సింహ నందమూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేయాల‌న్న‌ది స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి డ్రీమ్. ఇది ఇప్ప‌టిది కాదు. గ‌త‌ కొన్నేళ్ళుగా సాగుతున్న వ్య‌వ‌హారం. ఎట్టకేల‌కు ఇప్ప‌టికీ ఓ కొలిక్కి వ‌చ్చింద‌న్న‌ది ఫిల్మ్ న‌గ‌ర్ బ‌జ్. అంతేకాదు.. షైన్ స్క్రీన్స్ సంస్థ అధినేత‌లు సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదిలా ఉంటే.. బాల‌య్య కెరీర్ లోనే హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ తో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడ‌ట అనిల్. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. దాదాపు రూ. 75 కోట్ల మొత్తంతో ఈ సినిమా నిర్మాణం జ‌రుపుకోనుంద‌ట‌. బాల‌య్యని నెవ‌ర్ సీన్ బిఫోర్ క్యారెక్ట‌ర్, మేన‌రిజ‌మ్స్ తో చూప‌డ‌మే కాకుండా.. ఎన్నో స‌ర్ ప్రైజెస్ ఇవ్వ‌బోతున్నాడ‌ట అనిల్. మ‌రి.. ఈ వార్త‌ల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, బాల‌య్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జూన్ 10న ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఈ లోపు `అఖండ‌`తో బాల‌య్య అభిమానుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.