English | Telugu
సర్దార్ గబ్బర్ సింగ్ డబ్బులు ఎగ్గొట్టాడా..!
Updated : Apr 27, 2016
సర్దార్ గబ్బర్ సింగ్ ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో లెక్కేసుకొందాం అనుకొన్న పవన్ అభిమానులు. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర డీలా పడ్డడంతో బాగా నిరాశ పడ్డారు. రికార్డులు మాట అటుంచితే బయ్యర్లు ఎంత నష్టపోయారో ఇప్పుడు లెక్కలేసుకోవాల్సివచ్చింది. ఆ సంగతి అటుంచితే ఈ సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకూ సర్దార్ వల్ల నష్టాలేనట. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన పారితోషికం ఇంకా వాళ్లకు అందలేదని సమాచారం. నిర్మాత శరత్ మరార్ ఒకొక్కరికీ 25 శాతం నుంచి 40 శాతం వరకూ బకాయిపడ్డారట. సర్దార్ విడుదలైన తరవాత బకాయిలన్నీ తీరుద్దాం అని శరత్ మరార్ చెప్పడంతో, చిత్ర నిర్మాణంలో పవన్ కూడా భాగస్వామిగా ఉండడంతో ఇప్పటి వరకూ ఎవ్వరేం మాట్లాడలేదట. సినిమా విడుదలై మూడు వారాలు కావస్తున్నా శరత్ మరార్ నోరు తెరవకపోవడంతో ఈ పంచాయితీ పవన్ వరకూ వెళ్లిందట. వెంటనే ఈ విషయంపై స్పందించిన పవన్, శరత్ మరార్‌ని పిలిచి విషయం ఆరా తీశారట. ''ఇవ్వాల్సిన రెమ్యునరేషన్లు అర్జెంటుగా క్లియర్ చేసేయండి..'' అని శరత్ మరార్‌కి గట్టిగా చెప్పాడట. అంతే కాదు, తీవ్రంగా నష్టపోయిన బయ్యర్లను పిలిచి ఎంతో కొంత రిటర్న్ ఇమ్మని ఆర్డరేశాడట. దాంతో నటీనటులు, బయ్యర్లు ఊపిరి పీల్చుకొంటున్నారు.