English | Telugu

స్టైలిష్ స్టార్ బ‌న్నీ గొంతెమ్మ కోర్కెలు..!

సొంత సినిమా అనేస‌రికి క‌థానాయ‌కులు జాగ్ర‌త్త ప‌డిపోతారు. వీలైనంత త‌క్కువ ఖర్చుపెడ‌దాం అనే లెక్క‌లు వేసుకొంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అందుకు రివ‌ర్సట‌. స‌రైనోడు సినిమా గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. అంటే.. బ‌న్నీ సొంత సంస్థ‌. కాబ‌ట్టి బ‌న్నీ చాలా విష‌యాల్లో రాజీ ప‌డిపోయాడు అనుకొంటాం. కానీ.. అల్లు అర‌వింద్ ముక్కు పిండి మ‌రీ ఖ‌ర్చు చేయించాడ‌ట‌. అందుకే ఈ సినిమా బ‌డ్జెట్ రూ.50 కోట్లు దాటేసింద‌ట‌. తెలుసా, తెలుసా... అనే పాట స్విట్జర్లాండ్‌లో కోటి రూపాయ‌ల‌తో లాగించేద్దాం అనుకొన్నాడు అల్లుఅర‌వింద్‌. కానీ. బ‌న్నీ బొలీవియా కావాల‌న్నాడ‌ట‌. బొలీవియాలో అయితే ఈ పాట‌కు రూ.3 కోట్లు ఖ‌ర్చ‌వుతాయి అని చెప్పినా బ‌న్నీ విన‌లేద‌ట‌. ఈ విష‌యాన్ని బ‌న్నీ, అల్లు అర‌వింద్ ఇద్ద‌రూ అంగీక‌రించారు కూడా! ప్రైవేటు పార్టీ సాంగ్ కు బొంబాయి నుంచి 130 మంది డాన్స‌ర్ల‌ను ప్ర‌త్యేకంగా తెప్పించారు. అదీ..బ‌న్నీ కోరిక మేర‌కే. వాళ్ల‌కోసం కూడా భారీగా ఖ‌ర్చు పెట్టార‌ట‌. బ‌న్నీ వ‌ల్ల ఈ సినిమాకి మ‌రో రూ.5 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ అద‌నంగా ఖ‌ర్చ‌య్యింద‌ని అల్లు అర‌వింద్ చెబుతున్నారు. అంతేకాదండోయ్‌.. ఈ సినిమా కోసం బ‌న్నీ అందుకొన్న పారితోషికం రూ.12 కోట్ల‌ట‌. నాన్న సినిమా క‌దా అని రిబేటు ఇవ్వ‌కుండా, బ‌య‌ట సినిమా కంటే ఎక్కువ పారితోషికం రాయించుకొన్నాడు బ‌న్నీ. ఇస్తోంది కొడుక్కే క‌దా.. అని ఆయ‌నా రూ.12 కోట్లు ఇచ్చేశాడు. అదీ స‌రైనోడు బ‌డ్జెట్ వెనుక ఉన్న క‌థ‌.