English | Telugu
బ్రేకప్ తరువాత సమంత, సిద్దూ చేస్తున్న మూవీ..
Updated : Jan 8, 2015
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చించుకుంటున్న విషయం ఏమిటబ్బా అంటే సమంత, సిద్దార్థ్ ల బ్రేకప్. ఈ విషయంపై ఇండస్ట్రీలలో ఖాళీగా వున్నవారంతా చర్చలు జరుపుతున్నారు. అయితే వారు బ్రేకప్ చేసుకున్న కానీ ఓ సినిమాలో మాత్రం నటించడానికి అంగీకరించారట. అదే ‘బెంగళూర్ డేస్’. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో పివిపి సంస్థ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ రీమేక్ దర్శకత్వ భాద్యతలు చేపట్టారు. ఇక్కడ నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారని సమాచారం. మార్చ్ 1వ తేదీ నుండి హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. సిద్దార్ద్, సమంత ఈ సినిమా తమిళ వెర్షన్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో ఇంకా హీరోను ఖరారు చేయలేదు. అయితే ఈ సినిమా కోసం సమంత, సిద్దార్థ్ వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి వృత్తిపరంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారని సమాచారం.