English | Telugu

వెంకీ కూతురు.. సమంత‌?

టాలీవుడ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కాంబినేష‌న్ రూపుదాల్చ‌డానికి రంగం సిద్థ‌మైంది. వెంక‌టేష్‌, స‌మంత ఓ సినిమాలో క‌ల‌సి న‌టిస్తున్నారు. జంట‌గా కాదు, తండ్రీ కూతుర్లుగా. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన పీకూ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. ఈ సినిమా రైట్స్ ప్ర‌స్తుతం సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ద‌గ్గ‌రున్నాయి. విజ‌య‌భాస్క‌ర్‌తో ఈ సినిమాని పునఃనిర్మించాల‌ని సురేష్‌బాబు నిర్ణ‌యించుకొన్నారు.

బాలీవుడ్ లో అమితాబ్ పోషించిన పాత్ర‌లో వెంక‌టేష్ క‌నిపించ‌నున్నాడు. దీపికా ప‌దుకొనే పాత్ర‌లో స‌మంత న‌టించ‌నుంది. వెంకీతో క‌ల‌సి న‌టించ‌డానికి స‌మంత ఉత్సాహం చూపిస్తోంద‌ని, ఆ పాత్ర‌కు స‌మంత అయితేనే బాగుంటుంద‌ని సురేష్ బాబు భావిస్తున్నార‌ట‌. అయితే.. ఎంత ఏజ్ పెరిగినా ఇప్ప‌టికీ కుర్రాళ్లుగానే ఫీలైపోతుంటారు మ‌న హీరోలు. అలాంటిది తండ్రి పాత్ర‌కు వెంకీ ఒప్పుకొన్నాడంటే నిజంగా హ్యాట్రాఫ్ చెప్పాల్సిందే. మ‌రి పీకూగా వెంకీ ఎంత హంగామా చేస్తాడో, ఆ రీమేక్‌కి విజ‌య‌భాస్క‌ర్ ఎంత వ‌రకూ న్యాయం చేస్తాడో, వెయిట్ అండ్ సీ..