English | Telugu

రేష్మీ ఎఫైర్‌.. ఎవ‌రితో??

జబ‌ర్ ద‌స్త్ పుణ్య‌మా అని చాలామందికి లైఫ్ దొరికింది. క‌నీసం ఓ ప‌దిమంది క‌మెడియ‌న్స్‌... సినిమాల్లో చిన్నా చిత‌కా వేషాలేసుకొంటూ బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ వ‌ల్లే.. అన‌సూయ పాపుల‌ర్ అయ్యింది. ఇప్పుడు రేష్మీకీ అంతే క్రేజ్ ద‌క్కింది. ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవ‌డానికి సినిమాల్లోనూ అడుగుపెట్టింది రేష్మి. గుంటూరు టాకీస్‌లో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తోంది రేష్మి. ఈలోగా మ‌రో సినిమా కూడా ఒప్పుకొంది.

అయితే.. రేష్మి ప్రేమ‌లో ప‌డింద‌ని, ఓ యంగ్ క‌మెడియ‌న్‌తో ల‌వ్ ఎఫైర్ న‌డుపుతోంద‌న్న ఓ వార్త టాలీవుడ్‌లో షికారు చేస్తోంద‌ట‌. ఆ యంగ్ క‌మెడియ‌న్ ఎవ‌రో కాదు, జ‌బ‌ర్‌ద‌స్త్ గ్యాంగ్‌లో ఒక‌రే అని టాక్‌. వీరిద్ద‌రితో ఇప్పుడు ఓ సినిమా కూడా తెర‌కెక్క‌బోతోంద‌ని, రియ‌ల్ లైఫ్ ప్రేమికులు, రీల్ లైఫ్‌లోనూ ప్రేమికులుగానే క‌నిపించ‌బోతున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

సినిమాల‌పై దృష్టి పెట్టి, కెరీర్‌ని ప‌రుగులు పెట్టించాల్సిన ద‌శ‌లో రేష్మీ.. ఇప్పుడు ల‌వ్‌లో మునిగిపోవ‌డం కాస్త ఇబ్బంది క‌లిగించే ప‌రిణామ‌మే మ‌రి. రేష్మి ప్రేమాయాణం ఎన్ని ఎపిసోడ్లు సాగుతుందో.. దీనికి శుభం కార్డు ఎలా ప‌డుతుందో చూడాలి.