English | Telugu
ఓటీటీలో విడుదలకానున్న మెగా హీరో మూవీ!!
Updated : Jun 3, 2021
కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఎప్పుడు రీఓపెన్ అవుతాయో క్లారిటీ లేదు. దీంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎందరో స్టార్స్ సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. తాజాగా ఓ మెగా హీరో మూవీ సైతం ఓటీటీలో విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది.
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్' అనే మూవీ తెరకెక్కింది. ఈ సినిమా జూన్ 4న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపించకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అందులో భాగంగా ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, ఓ ప్రముఖ ఓటీటీ నుంచి మంచి ఆఫర్ కూడా వచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న 'రిపబ్లిక్' మూవీలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలను పోషిస్తున్నారు. వెన్నెల, ప్రస్థానం సినిమాలతో డైరెక్టర్ గా తనదైన ముద్ర దేవ కట్టా.. ఆ తరువాత ఆ స్థాయిలో తన మార్క్ ని చూపలేకపోయారు. మరి 'రిపబ్లిక్'తో దేవ కట్టా తన మార్క్ చూపిస్తారేమో చూడాలి.