English | Telugu

`ల‌వ్ స్టోరి`లో రేప్ బాధితురాలిగా సాయిప‌ల్ల‌వి?

`ఫిదా` (2017) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్ లో డాన్సింగ్ సెన్సేష‌న్ సాయిప‌ల్ల‌వి చేసిన చిత్రం `ల‌వ్ స్టోరి`. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమా.. వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల కావాల్సింది. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే .. సెప్టెంబ‌ర్ 24న ఈ ప్రేమ‌క‌థా చిత్రం జ‌నం ముందుకు రానుంద‌ట‌.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. ఇందులో సాయిప‌ల్ల‌వి రేప్ కి గుర‌య్యే యువ‌తిగా క‌నిపించ‌నుంద‌ట‌. అంతేకాదు.. స్వ‌యంగా త‌న అంకుల్ (రాజీవ్ క‌న‌కాల‌) ఆమెపై అత్యాచారం చేస్తాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో.. సాయిప‌ల్ల‌వి తీసుకునే నిర్ణ‌యం ఏంటి? రాజీవ్ పాత్ర‌కి ఎలా బుద్ధి చెప్పింది? అన్న‌దే ఈ చిత్రంలో కీల‌క‌మైన అంశ‌మ‌ని టాక్. మ‌రి.. `ల‌వ్ స్టోరి`లోని ట్విస్ట్ పై జ‌రుగుతున్న ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.