English | Telugu

ర‌ష్మిక‌తో రాహుల్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్?

`చి ల సౌ`(2018)తో ద‌ర్శ‌కుడిగా అవ‌తార‌మెత్తాడు న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్. మొదటి ప్ర‌య‌త్నంలోనే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు, ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ సొంతం చేసుకున్నాడు. ఆపై ద్వితీయ చిత్రంగా `మ‌న్మ‌థుడు 2`(2019) తీశాడు. కింగ్ నాగార్జున హీరోగా న‌టించిన‌ ఈ రీమేక్ మూవీ.. బాక్సాఫీస్ ముంగిట‌ ఘోర ప‌రాజ‌యం పాల‌య్యింది. దీంతో.. మూడో సినిమా విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు రాహుల్. ఈ క్ర‌మంలోనే.. ఓ ఫిమేల్ సెంట్రిక్ స‌బ్జెక్ట్ రెడీ చేసుకున్నాడు.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఈ స‌బ్జెక్ట్ త్వ‌ర‌లోనే తెర‌రూపం దాల్చ‌నుంద‌ట‌. అంతేకాదు.. స్టార్ హీరోయిన్ ర‌ష్మికా మంద‌న్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో లీడ్ రోల్ చేయ‌బోతోంద‌ని స‌మాచారం. అలాగే, ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మించ‌బోతోంద‌ని వినికిడి. త్వ‌ర‌లోనే ర‌ష్మిక - రాహుల్ ర‌వీంద్ర‌న్ - గీతా ఆర్ట్స్ కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ రానుంది. మ‌రి.. ఈ విమెన్ సెంట్రిక్ మూవీతో రాహుల్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌స్తాడేమో చూడాలి.

కాగా, ప్ర‌స్తుతం ర‌ష్మిక చేతిలో `పుష్ప‌`, `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు` వంటి తెలుగు చిత్రాల‌తో పాటు `మిష‌న్ మ‌జ్ను`, `గుడ్ బై` వంటి హిందీ చిత్రాలున్నాయి. వీట‌న్నింటిలోనూ న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నుంది ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్.