English | Telugu

చ‌ల‌ప‌తిరావు... చైతూ సినిమాని ముంచేశాడా?


ఒక్క డైలాగ్‌, నోరు జారిన ఒక్క మాట ఎంత ప‌నిచేసిందో చూడండి. ఇన్నాళ్లుగా ఓ సీనియ‌ర్ న‌టుడి హోదాలో రాణిస్తున్న ఓ పెద్ద మ‌నిషిని బ‌జారుకీడ్చింది. మ‌హిళా సంఘాలు ఆయ‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసేవ‌ర‌కూ వెళ్లింది వ్య‌వ‌హారం. ఇలాంటి వ్య‌వ‌హారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోని `మా` వాళ్లు కూడా... స‌దరు న‌టుడ్ని ఏకి పాడేసే కార్య‌క్ర‌మానికి దిగారు. చివ‌ర‌కి `అయ్యో త‌ప్ప‌యిపోయింది క్ష‌మించండి` అంటూ ఆ పెద్దాయ‌న బావురుమంటున్నాడు. ఇప్పుడు ఆ డైలాగ్ ఎఫెక్ట్ రారండోయ్ వేడుక చూద్దాం సినిమాపై ప‌డే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచిన న‌టుడు ఉన్న సినిమాలు మేం చూడం అంటూ.. కొన్ని మ‌హిళా సంఘాలు... `రారండోయ్..` ని స్వ‌చ్ఛందంగా బ్యాన్ చేశాయి. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి... ఈ సినిమాపై ఎఫెక్ట్ ప‌డ‌బోతోందేమో అనిపిస్తోంది.

ఇంత రాద్దాంతానికి కార‌ణ‌మైన‌ `అమ్మాయిలు మ‌న‌శ్శాంతికి హానిక‌రం` అనే డైలాగ్‌పైనా ఫోక‌స్ ప‌డింది. అస‌లు ఈ డైలాగ్‌నే సినిమా నుంచి తొల‌గించాల‌ని కొంత‌మంది వాదిస్తున్నారు. ఇలాంటి డైలాగుల్ని సెన్సార్ ఆమోదించ‌కూడ‌ద‌ని డిమాండ్ చేస్తున్నారు. చిత్ర‌బృందం కూడా ఈ విష‌యంపై సానుకూలంగానే స్పందించిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. చైతూ చెప్పిన డైలాగ్‌ని ఈ సినిమా నుంచి తొల‌గించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే ఓ సంద‌ర్భంలో ర‌కుల్ కూడా `అబ్బాయిలు విష‌పూరితం` అంటుంద‌ట‌. మ‌రి ఈ డైలాగ్ పై అబ్బాయిలేమైనా స్పందిస్తారేమో చూడాలి.