English | Telugu

చ‌ల‌ప‌తిరావు... ఇంత నీచంగా మాట్లాడ‌తావా??


ఆడ‌వాళ్ల‌ని గౌర‌వించ‌డం మ‌న సంప్ర‌దాయం. మ‌న‌సులో గౌర‌వం ఉన్నా, లేకున్నా క‌నీసం మాట్లాడేట‌ప్పుడైనా మాట వ‌ర‌స‌కైనా ఆ గౌర‌వాన్ని చూపించాలి. లేదంటే... మాట్లాడ్డ‌మే మానేయాలి. కానీ చ‌ల‌ప‌తిరావుకి మాత్రం ఆ జ్ఞానం ఏ కొశైనా లేదేమో అనిపిస్తోంది. తాజాగా ఆయ‌న `ఆడ‌వాళ్లు ప‌క్క‌లోకి ప‌నికొస్తారు `అంటూ నోరు జారి మాట్లాడేశాడు. రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్ష‌న్‌లో వినిపించిన ఓ చేదు... మాట ఇది. `అమ్మాయిలు మ‌నశ్శాంతికి హానిక‌రమా` అని చ‌ల‌ప‌తిరావు ని అడిగింది యాంక‌ర్. `అదేమో గానీ, అమ్మాయిలు ప‌క్క‌లోకి ప‌నికొస్తారు` అంటూ మైకు ముందు నోటికొచ్చింది వాగేశాడు చ‌ల‌ప‌తిరావు. అమ్మాయిలంటే మ‌రీ అంత చుల‌క‌నా?? మ‌రీ ఇంత నీచంగా ఎవ‌రైనా మాట్లాడ‌తారా? చ‌ల‌ప‌తిరావుకి అమ్మాయిల్లేరా? వాళ్లింట్లో ఆడ‌వాళ్లే లేరా? వాళ్లు ఈ పోగ్రాంనీ, చ‌ల‌ప‌తిరావు మాటల్నీ చూడ‌రా, విన‌రా?? బాబాయ్ బాబాయ్ అని అంద‌రితో పిలిపించుకొనే చ‌ల‌ప‌తిరావు.. బాబాయ్ లా ఉంటున్నాడా, బాబోయ్ అనేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడా?? ఇప్పుడ‌నే కాదు, చ‌ల‌ప‌తిరావు ఎప్పుడూ అంతే. నోటికొచ్చింది వాగేసి, అదే కామెడీ అనుకోమంటాడు. ఇలాగైతే మున్ముందు చ‌ల‌ప‌తిరావుకి మైకు ఇవ్వ‌డానికి ఎవ‌రైనా ధైర్యం చేస్తారా? ఒక్క‌సారి చ‌ల‌ప‌తిరావు ఆత్మ విమ‌ర్శ చేసుకొంటే మంచిది. లేదంటే ఆడ‌వాళ్ల‌తోనే చివాట్లు తినే రోజు ఇంకెంతో దూరంలో ఉండ‌దు.