English | Telugu
బ్రహ్మాజీకి డూప్‌గా చెర్రీ?
Updated : Jul 15, 2015
శ్రీనువైట్ల సినిమా అంటే బోల్డన్ని చతుర్లు. సినిమా ఇండ్రస్ట్రీమీద ఆయన వేసినన్ని సెటైర్లు ఎవ్వరూ వేసుండరు. దుబాయ్ శీను చూశారుగా.. సల్మన్ రాజుగా ఎమ్మెస్ నారాయణని అడ్డంపెట్టుకొని ఓ ప్రముఖ హీరోపై సెటైర్లు వేసేశారు. లేటెస్ట్ మూవీ ఆగడులోనూ సినీ హీరోలపై సెటర్లు పడ్డాయి.
ఇప్పుడు రామ్‌చరణ్ సినిమాలోనూ అవన్నీ పుష్కలంగా ఉన్నాయట. ఈ సినిమాలో చరణ్ ఓ ఫైట్ మాస్టర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫైట్ మాస్టర్ అనగానే ఇదేదో సినీ నేపథ్యంలో సాగే సినిమా అని క్లియర్ గా అర్థమవుతోంది. నిజంగానే ఇది సినిమా నేపథ్యంలో సాగే కథ.
ఇందులో సూపర్ స్టార్ పాత్రలో బ్రహ్మాజీ నటిస్తున్నాడు. ఆయనకు డూప్‌గా చరణ్ కనిపిస్తాడట. ఈసారి బ్రహ్మాజీని అడ్డుపెట్టుకొని శ్రీనువైట్ల మరింత రెచ్చిపోయాడని టాక్. హీరోలు, వారి ఫైటర్ల మీద బోలెడన్ని జోకులు పేల్చాడట. స్నూఫ్ లకైతే కొదవ లేదని తెలుస్తోంది. దూకుడు ఫార్మెట్‌లోనే ఓ ఎపిసోడ్ మాత్రం స్నూఫ్ లతో కామెడీ సృష్టించాడట శ్రీనువైట్ల. ఓ హాస్యనటుడుకి ఓ అగ్ర హీరో డూప్‌గా నటించడం... ఈ సినిమా స్పెషాలిటీ.. అదే సెంట్రాప్ ఎట్రాక్షన్ అని టాక్.