English | Telugu
బయ్యర్లను ముంచేసే స్కెచ్‌తో.. చరణ్
Updated : Nov 13, 2015
రామ్‌చరణ్ త్వరలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఒక్క సినిమా కూడా చేయకుండానే ప్రొడ్యూసర్ క్వాలిటీలను బాగానే ఒంటపట్టించుకొన్నాడు. బయ్యర్లకు దొరక్కుండా ఎలా మేనేజ్ చేయాలో చరణ్‌కి బాగా అర్థమైపోయింది. అందుకే ఇదే లేటెస్ట్ ఉదాహరణ. బ్రూస్లీ సినిమాతో చాలా ఏరియాల్లో బయ్యర్లు భారీగా నష్టపోయారు. ఓవర్సీస్ రైట్స్ కొన్న బయ్యర్ పరిస్థితి అయితే ఇక చెప్పక్కర్లేదు. పది రూపాయలు పెఉట్టి కొంటే ఏడు రూపాయలు ఎగిరిపోయాయి. అదీ... బ్రూస్లీ దెబ్బ.
వీళ్లందరికీ తరువాతి సినిమాతో న్యాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతగా కాదంటే.. ఎంతో కొంత డబ్బులు వెనక్కిచ్చి నష్టపరిహారం చేల్లించాలి. ఈ రెండూ చేయట్లేదు చరణ్. `డబ్బులు ఇస్తానని ఎక్కడైనా రాసిచ్చానా` అని రివర్స్ లో మాట్లాడుతున్నాడట. వచ్చే సినిమాలో సర్దుబాటు చేయాలంటే.. అది కచ్చితంగా డి.వి.వి దానయ్య సినిమానే అయ్యుండాలి.
నిజానికి `తను ఒరువన్` సినిమా దానయ్య ప్రొడక్షన్లోనే తీయాలి. అయితే.. ఈ సినిమా కోసం దానయ్యను పక్కన పెట్టినట్టు పైకి బిల్డప్ ఇస్తున్నాడు చెర్రీ. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తే.. బ్రూస్లీకీ గీతా ఆర్ట్స్‌కి సంబంధం ఉండదు కాబట్టి.. తని వరువన్ మళ్లీ యధాతధంగా ఎక్కువ రేట్లకు అమ్ముకోవచ్చని, బ్రూస్లీ బయ్యర్లకు సమాధానం చెప్పనవసరంలేదని చరణ్ ప్లాన్. వాటే ప్లాన్,.. చెర్రీ. నువ్వు బాగా ఎదిగిపోయావ్. మునిగిపోయేది మాత్రం.. బ్రూస్లీ కొన్న బయ్యర్లే.