English | Telugu
అసలు సమంత ఉద్దేశమేంటి?
Updated : Nov 13, 2015
అందాల తార సమంత హీరోయిన్‌గా బిజీగా వుండటం మాత్రమే కాదు... వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కూడా ముందుంటోంది. ఆమధ్య అగ్రహీరోల మీద కూడా కామెంట్లు చేసి సమంత సంచలనం సృష్టించింది. ఇప్పుడు సమంత చేసిన కామెంట్లు మరో సంచలనానికి కారణం అయ్యాయి. అసలు సమంత కాంట్రవర్సీ చేయాలనే మాట్లాడుతుందా... లేక సమంత మాట్లాడిన మాటలు కాంట్రవర్సీ అవుతూ వుంటాయా అనే సందేహాలు జనానికి వస్తున్నాయి. ఇంతకీ లేటెస్ట్ కాంట్రవర్సీ ఏంటంటే, మొన్నామధ్య సమంత ఓ ఆస్పత్రి వాళ్ళు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా తన అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే సమంత చనిపోయిన తర్వాత (అమంగళము ప్రతిహతమవుగాక) ఆమె శరీర అవయవాలను ఇతరులకు అమర్చడానికి తీసుకోవచ్చన్నమాట. మొత్తానికి సమంత మంచిపనే చేసింది. అయితే అంత మంచి పని చేసిన సమంత పనిలోపనిగా కొన్ని కామెంట్లు కూడా చేసింది. ‘అవయవదానం చేసిన వాళ్ళే నిజమైన హీరోలు’ అని కామెంట్ చేసింది. ఈ కామెంట్లకు టాలీవుడ్‌లో రకరకాల అర్థాలు తీస్తున్నారు. అంటే ఏంటీ... ఇప్పుడు టాలీవుడ్‌లో వున్న హీరోలు సమంత లాగా అవయవ దానం చేస్తేనే నిజమైన హీరోలా... చేయకపోతే కాదా అని అనుకుంటున్నారు. హీరోలను టార్గెట్ చేసే సమంత ఈ కామెంట్ చేసిందని భావిస్తున్నారు.