English | Telugu
కావాలనే బాలయ్యతో పోటీ పడుతున్నాడా??
Updated : Nov 13, 2015
నందమూరి కాంపౌండ్ లో బాలకృష్ణ, ఎన్టీఆర్‌ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే! ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి, పై చేయి సాధించడానికి ప్రయత్నించడం నందమూరి ఫ్యాన్స్‌కి తెలుస్తూనే ఉంది. అయితే.. ఇప్పటి వరకూ వీళ్లిద్దరూ బాక్సాఫీసు దగ్గర పోటీ పడలేదు. ఇప్పుడు.. ఆ ముచ్చటా తీరిపోతోంది. డిక్టేటర్ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపాడు బాలయ్య. అది చూసి ఎన్టీఆర్ కూడా సై అనేశాడు.
నాన్నకు ప్రేమతో సినిమాని సంక్రాంతికే విడుదల చేయాలని దర్శక నిర్మాతలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నాడట ఎన్టీఆర్. నిజానికి.. నాన్నకు ప్రేమతో సినిమా సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకొన్నదే. మధ్యలో షూటింగ్ ఆలస్యమై... అది కాస్త ఫిబ్రవరికి మళ్లింది. బాలయ్య సంక్రాంతికి వస్తున్నాడని తెలుసుకొన్న ఎన్టీఆర్,.. సమరశంఖం పూరించాడు. తన సినిమానీ సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఆఘమేఘాల మీద నిర్ఱయం తీసుకొన్నాడు. ఇప్పుడు సుకుమార్ ని షూటింగ్ ముగించమని తొందర చేస్తున్నాడట.
స్పెయిన్‌లో భారీ షెడ్యూల్ చేయాల్సివుంది. అయితే.. స్పెయిన్ వీసాలు దొరక్క... షూటింగ్ ఆలస్యమైంది. ఆసన్నివేశాల్ని హైదరాబాద్లోనే తీసేసి, మ్యాచ్ చేసేద్దామంటున్నాడట ఎన్టీఆర్. దానికి సుకుమార్ ససేమీరా అంటున్నాడని తెలుస్తోంది. షూటింగ్ టక టక ముగించకపోతే.. ఈ సినిమా సంక్రాంతికి రాదు. అందుకే.. సుకుమార్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాడని, గత్యంతరం లేక... సుక్కు కూడా ఎన్టీఆర్ చెప్పినట్టే వింటున్నాడటని టాక్. బాలయ్యపై పోటీపడడానికి నాన్నకు ప్రేమతో సినిమాని హడావుడిగా లాగించేస్తున్నాడన్నమాట. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో?? బాబాయ్ అబ్బాయ్‌లలో గెలుపెవరిదో???