English | Telugu

చ‌ర‌ణ్ బాబూ... ఇమిటేష‌న్ల‌ను ఆప‌వా??

రామ్‌చ‌ర‌ణ్‌... తండ్రి చిరంజీవి ల‌క్ష‌ణాల్ని అక్ష‌రాలా పుణికి పుచ్చుకొన్నాడు. చ‌ర‌ణ్ కామెడీ టైమింగ్‌, యాక్ష‌న్ సీన్ల‌లో ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్స్ డిట్లో చిరువే. నాన్న‌ని ఇమిటేట్ చేస్తే ఫ్యాన్స్ ఖుషీ అవుతార‌న్న న‌మ్మ‌కం చ‌ర‌ణ్‌ది. ఫ్యాన్స్ కూడా అలానే ఫీల‌య్యేవారు. కానీ ఆ ఇమిటేష‌న్ రాను రాను ఎక్కువ‌వ్వ‌డంతో ఇరిటేష‌న్ వ‌చ్చింది. 'చ‌ర‌ణ్ నీ స్టైల్ నువ్వు చూపించు...' అని చ‌ర‌ణ్ ఫ్యాన్సే.. నేరుగా చాలా సార్లు సూచించార్ట‌. అయితే చ‌ర‌ణ్ ఏమాత్రం మార‌లేదు. ధృవ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లోనూ డాడీని కాపీ కొట్టేశాడు చ‌ర‌ణ్‌. ధృవ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆగ‌స్టు 15 సంద‌ర్భంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. తీరా చూస్తే.. స్టాలిన్‌లో చిరు లుక్‌ని అచ్చుగుద్దిన‌ట్టు దింపేశారు. త‌ల వాల్చి.. స్టైల్ గా న‌డుస్తున్న స్టాలిన్ పోస్ట‌ర్‌తో, ధృవ పోస్ట‌ర్‌ని పోలుస్తూ అభిమానులు అప్పుడే ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్‌ల‌లో హ‌డావుడి చేసేస్తున్నారు. నాన్ మెగా ఫ్యాన్స్ అయితే... 'చ‌ర‌ణ్ ఈ కాపీ ఎప్పుడు వ‌దులుతాడో' అంటూ కౌంట‌ర్లు వేస్తున్నారు. మొత్తానికి చ‌ర‌ణ్ లుక్‌కి మిక్స్‌డ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే చ‌ర‌ణ్ ఈ ఇమిటేష‌న్లు మానుకోవాలి. లేదంటే.. ముఖేష్ యాడ్‌లో డైలాగ్ లా 'భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు'.