English | Telugu
నయనతారపై టాలీవుడ్ నిషేధం
Updated : Aug 16, 2016
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా చలామణీ అయిన కథానాయిక నయనతార. కోటి రూపాయల పారితోషికం అందుకొన్న తొలి కథానాయికగా తన పేరు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిలో లిఖించుకొంది. టాప్ హీరోలందరితోనూ నయన నటించింది. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. అయితే... నయన ఇక తెలుగు తెరపై కనిపించకపోవొచ్చు. బాబు బంగారమే తన ఆఖరి సినిమా అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా నయన తెలుగు సినిమాలపై ఫోకస్ తగ్గించేసింది. బాలకృష్ణ, చిరంజీవిలాంటి టాప్ హీరోల సినిమాల కోసం డేట్లు అడిగినా... ఇవ్వడం లేదు. పైగా నయనతార విషయంలో తెలుగునాట దర్శక నిర్మాతలు విసిగిపోయారు. ఓ సినిమా ఒప్పుకొంటే నరకం చూపిస్తుందని... వాళ్ల భయం. సెట్‌కి ఆలస్యంగా రావడం దగ్గర్నుంచి ప్రతీ విషయంలోనూ నయనపై కంప్లైంట్లు ఉన్నాయి. నిర్మాతల మండలిలోనూ ఆమెపై చాలా ఫిర్యాదులు నమోదయ్యాయి. బాబు బంగారం షూటింగ్ సమయంలో నిర్మాతల్ని విసిగించిన తీరు వర్ణనాతీతం. నయనపై చిత్రీకరించాల్సిన పాట కూడా రద్దు చేసుకొన్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవొచ్చు. నయనని ఇక మీదట సినిమాల్లోకి తీసుకోకూడదని నిర్మాతల మండలినిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. మరోవైపు నయన కూడా తెలుగు సినిమాల్లో ఇక నటించకూడదని స్ట్రాంగ్‌గా నిర్ఱయం తీసుకొందట. ఇక నయనను చూడాలంటే డబ్బింగ్ బొమ్మలే గతి.