English | Telugu
అమలాపాల్‌కి అన్యాయం చేస్తోందెవరు?
Updated : Aug 16, 2016
అమలాపాల్.. గత కొంతకాలంగా మీడియాలో పాపులర్ అయిన పేరు. భర్త విజయ్‌కి దూరంగా ఉంటూ... ఇప్పుడు విడాకులకు అప్లై చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఈ జంట కాపురం మూణాళ్ల ముచ్చట అవ్వడం కోలీవుడ్‌కి కలవర పెట్టింది. విడిపోదామన్న నిర్ణయం తీసుకొన్న తరవాత కూడా అమలాపాల్‌కి అత్తింటి వేధింపులు తప్పడం లేదని టాక్. భర్త విజయ్ ఆలోచనలకు వ్యతిరేకంగా సినిమాల్లో నటించాలన్న నిర్ణయం తీసుకోవడమే అమలాపాల్ విడాకులకు కారణం అని తెలుస్తోంది. అయితే... ఇప్పుడు కూడా అమల కోరుకొన్న జీవితం దొరకడం లేదు. ఎందుకంటే అమలాపాల్ సినిమాల్లో ఛాన్సుల కోసం ఎంత సీరియస్ గా ప్రయత్నిస్తోందో అంతే సీరియస్‌గా అత్తింటివాళ్లు అమలాపాల్‌కి అవకాశాలు దొరక్కుండా చూస్తున్నార్ట.
విజయ్ పరపతిని ఉపయోగించుకొని అమలాపాల్‌కి ఎవ్వరూ సినిమా ఛాన్సులు ఇవ్వకుండా గట్టిగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కొంతమంది దర్శకులకు, నిర్మాతలకు ఫోన్లు చేసి 'అమలాపాల్‌కి మీ సినిమాల్లో ఛాన్సులు ఇవ్వొద్దు' అని చెప్పేస్తున్నార్ట. ఈ విషయం అమలాపాల్‌కీ తెలిసింది. 'ఇంతకంటే అన్యాయం ఉంటుందా' అంటూ సన్నిహితుల దగ్గర బోరుమంటోందట. ఇదంతా చూస్తుంటే విజయ్ ఇంట్లోవాళ్లు అమలాపాల్‌పై కక్ష కట్టినట్టే కనిపిస్తోంది. ఈపద్మవ్యూహం నుంచి అమలాపాల్ ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.