English | Telugu

`భీమ్లా నాయ‌క్`లో మ‌రో `మీన‌న్`?

మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్` కి రీమేక్ గా రూపొందుతున్న చిత్రం `భీమ్లా నాయ‌క్`. టైటిల్ రోల్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న ఈ క్రేజీ మ‌ల్టిస్టార‌ర్ లో రానా ద‌గ్గుబాటి మ‌రో హీరోగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. సాగ‌ర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న‌ ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. `భీమ్లా నాయ‌క్`లో ప‌వ‌న్ కి జంట‌గా కేర‌ళ‌కుట్టి నిత్యా మీన‌న్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా, రానాకి జోడీగా ఐశ్వ‌ర్యా రాజేశ్ ఎంపికైంది. అయితే, కాల్షీట్ల స‌మ‌స్య కార‌ణంగా ఐశ్వ‌ర్య త‌ప్పుకోవ‌డంతో.. ఇప్పుడా పాత్ర‌లో మ‌రో కేర‌ళ‌కుట్టి సంయుక్త మీన‌న్ న‌టించ‌బోతోంద‌ని టీటౌన్ టాక్. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

`భీమ్లా నాయ‌క్`ని సితార ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుండ‌గా.. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు. సంక్రాంతి కానుక‌గా 2022 జ‌న‌వ‌రి 12న `భీమ్లా నాయ‌క్`ని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.